Tuesday, 28 June 2011

పుత్రోత్సాహం

నిన్న గాక మొన్న 
పుట్టిన బుడతడు;
డబ్బా పాలు వద్దంటూ
ఏడ్చి మరీ 
అమ్మ పాలు తాగిన 
అసాధ్యుడు;
ఇంటిలోని చాక్ పీసులన్ని 
చాటుమాటుగా చప్పరించిన 
చిలిపి కృష్ణుడు;
మొదటి రోజు 
స్కూల్ కి వెళుతూ 
నాన్న... నేను .. నేను... 
చూలుకి వెళుతున్నా అంటూ 
నాకొక ముద్దు, వాడి అమ్మకొక ముద్దు 
పెడుతుంటే, తండ్రిగా ఏదో తెలియని 
ఆనందం - మరదేనేమో పుత్రోత్సాహం . 
                      ***

ఫుట్ పాత్ పుస్తకాలు ...

  

* * * 
ఆ పుస్తకాలన్నీ ఒకప్పుడు
అద్దాల షోకేసుల్లో
అందంగా కొలువు తీరినవే !
నాజూకుగా  ఒకరినుండి
మరొకరికి చేతులు
మారినవే!

* * *
ఆ పుస్తకాలు  ఒకప్పుడు
ఎందరో విద్యార్థులకు
ర్యాంకుల పంట పండి చినవే
ఇదుఅంకెల కొలువులు
అందించినవే

* * *
ఆ పుస్తకాలు ఒకప్పుడు
ఎన్నో అలసిన మనసులకు
ఆహ్లాదాన్ని పంచినవే
మేధస్సుకు పదును
పెట్టినవే 

* * *

అరలు నిండాయానో 
అభిరుచులు మారాయనో
అట్ట  చిరిగిందనో
లేక పుటలు ఊడాయనో
కిలోల చప్పున అమ్ముడుపోతాయి
ఇలా ఫుట్ పాత్ లపై చేరిపోతాయి
* * *  

కొత్త పుస్తకాలకు నోచుకోలేని
ఏ పేద విధ్యార్దో
జిజ్ఞాసను చంపుకోలేని
ఏ మధ్యతరగతి చదువరో
వాటిని కోనేవరకు
ఆప్యాయంగా గుండెలకు
హత్తుకోనేవరకు
అవి  ఎండకు ఎండాల్సిందే
వానకు తడవాల్సిందే.
* * *