బాల సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళలో నేను ఒకడ్ని. మొదటి సారి " శివ పుత్రుడు" సినిమా చూసినప్పుడు అందులోని పాత్రలు వాటి భావోద్వేగాలు నన్ను చాలా రోజులు వెంటాడాయి. అసలు అ దర్శకుడికి ఆ ఆలోచన రావడమే నన్ను ఆశ్చర్య పరచింది . మన తెలుగు హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తారా ?-- చేసినా తమ పాత్రలకు తగిన అభినయం కనపరుస్తారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కధను నమ్ముకోకుండా కేవలం క్రేజీ కాంబినేషనల పేరుతొ ప్రేక్షకులను సినిమా హాలు గడప తొక్కకుండా చేస్తూ వాళ్ళు మాత్రం వ్యాపార ప్రకటనలతో డబ్బు గడిస్తున్నారు మన తెలుగు హీరోలు.
నా నోట్ బుక్ ....
Friday, 1 July 2011
Tuesday, 28 June 2011
పుత్రోత్సాహం
నిన్న గాక మొన్న
పుట్టిన బుడతడు;
డబ్బా పాలు వద్దంటూ
ఏడ్చి మరీ
అమ్మ పాలు తాగిన
అసాధ్యుడు;
ఇంటిలోని చాక్ పీసులన్ని
చాటుమాటుగా చప్పరించిన
చిలిపి కృష్ణుడు;
మొదటి రోజు
స్కూల్ కి వెళుతూ
నాన్న... నేను .. నేను...
చూలుకి వెళుతున్నా అంటూ
నాకొక ముద్దు, వాడి అమ్మకొక ముద్దు
పెడుతుంటే, తండ్రిగా ఏదో తెలియని
ఆనందం - మరదేనేమో పుత్రోత్సాహం .
***
ఫుట్ పాత్ పుస్తకాలు ...
ఆ పుస్తకాలన్నీ ఒకప్పుడు
అద్దాల షోకేసుల్లో
అందంగా కొలువు తీరినవే !
నాజూకుగా ఒకరినుండి
మరొకరికి చేతులు
మారినవే!
* * *
ఆ పుస్తకాలు ఒకప్పుడు
ఎందరో విద్యార్థులకు
ర్యాంకుల పంట పండి చినవే
ఇదుఅంకెల కొలువులు
అందించినవే
* * *
ఆ పుస్తకాలు ఒకప్పుడు
ఎన్నో అలసిన మనసులకు
ఆహ్లాదాన్ని పంచినవే
మేధస్సుకు పదును
పెట్టినవే
* * *
అరలు నిండాయానో
అభిరుచులు మారాయనో
అట్ట చిరిగిందనోలేక పుటలు ఊడాయనో
కిలోల చప్పున అమ్ముడుపోతాయి
ఇలా ఫుట్ పాత్ లపై చేరిపోతాయి
* * *
కొత్త పుస్తకాలకు నోచుకోలేని
ఏ పేద విధ్యార్దో
జిజ్ఞాసను చంపుకోలేని
ఏ మధ్యతరగతి చదువరో
వాటిని కోనేవరకుఆప్యాయంగా గుండెలకు
హత్తుకోనేవరకు
అవి ఎండకు ఎండాల్సిందే
వానకు తడవాల్సిందే.
* * *
Subscribe to:
Posts (Atom)
